వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిలో భాగంగా బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చెన్నేకొత్తపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన కనుముక్కల లక్ష్మన్న కుమారుడు కనుముక్కల నాగభూషణం (40) అలాగే ఆయన భార్య జయలక్ష్మి లు ఇరువురు కలిసి గ్రామానికి సమీపంలోని చెరువులో బట్టలు ఉతకడానికి శుక్రవారంనాడు ఉదయం వెళ్లారు. ఆయనకు పుట్టుకతోనే పోలియో సోకివుండడంతో వికలాంగునిగా ఉండేవారు.
జీవనోపాధినిమిత్తం కుల వృత్తి అయిన బట్టలు ఉతికెందుకేబీ సముపంలోని చెరువులోకి బట్టలు ఉతకడానికి వెళ్లారు. అనుకోకుండా ఆకస్మికంగా కాలు జారీ చెరువులో పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే భార్య గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్థులు వచ్చి నీళ్లలోనుంచి బయటకు తీసిలోపే మృత్యువాతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే చెన్నేకొత్తపల్లి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మృతిచెందియున్నాడని నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దుఃఖాన్ని వెలిబుచ్చారు. మృతుడికి భార్య జయలక్ష్మితో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగియున్నారు.