నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికల 2021 సందర్భంగా శుక్రవారం గోరంట్ల మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు, మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు ఎంపిడిఓ దేశం గారి అంజన ప్ప మరియు రిటర్నింగ్ ఆఫీసర్ రత్నం చే శిక్షణ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా ఆయా పంచాయతీల్లో ఎన్నికల బాధ్యత మరియు ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా ఆ పంచాయతీ సెక్రటరీలే చూడాలని, మరియు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందువలన ప్రతి పంచాయతీలోనూ ఎంసిసి అధ్యక్షుడిగా పంచాయతీ కార్యదర్శి ఉండి కచ్చితంగా ఎన్నికల నియమావళి అమలు అయ్యేలా చూడవలెనని సూచించారు.
మండల స్థాయి లో ఎంసీసీ టీం కు ఏవో రామ నాయక్ అధ్యక్షత వహించి టీమ్ మెంబర్స్ గా సెక్రటరీలు జి. ప్రకాష్ మరియు రవి మండల వ్యాప్తంగా ఎంపీసీ అమలయ్యే విధంగా చూస్తారని ఎక్కడ కూడా ఎవరూ కూడా పర్మిషన్ లేకుండా సభలు పెట్టడం పార్టీ పోస్టర్లు అంటించడం, విందులు, వినోదాలు లాంటివి చేయకూడదని పర్మిషన్ లేకుండా మైకులు వాడొద్దని వివరించారు, ఎవరైనా డబ్బులు పంచుతూ ఉన్నట్టుగా గిఫ్ట్ లు ఇస్తున్నట్టు గాని సమాచారం అందితే ఏంసిసి టీంకు సమాచారం అందించాలని వివరించారు.
ఇంకా మండల వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు ఎస్ ఎస్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయని దీనికి సిఎస్ డిటీ మనోహర్ మరియు డిప్యూటీ తాసిల్దారు రెడ్డి శేఖర్ అధ్యక్షత వహిస్తున్నార అని తెలియజేశారు.
ఎన్నికలు సందర్భంగా ప్రతి పంచాయతీలోనూ పోలింగ్ స్టేషన్లను మరియు విధులు నిర్వహించే వారి యొక్క మౌలిక వసతులు త్రాగు నీరు, విద్యుత్తు మరియు టాయిలెట్స్ ల ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలు చూసుకోవాలని ఆదేశించారు. మరియు ఎవరైనా ఎన్నికలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల కోసం వస్తే వెంటనే జారి చేయవలసిందిగా కోరారు. పంచాయతీ సెక్రటరీలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు సచివాలయ ఉద్యోగ స్తులు కూడా పోలింగ్ ఏర్పాట్లు కు సహాయం చేయవలసిందిగా కోరారు.