ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

14264చూసినవారు
ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
గోరంట్ల మండలం లోని ఎం కొత్తపల్లి క్రాస్ వద్ద సోమవారం రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సిఐ జయ నాయక్ తెలిపారు. మండలంలోని దేవుల చెరువు గ్రామానికి చెందిన బాబయ్య ( 68) అతని కుమారుడు ఆంజనేయులు (45) ఇద్దరూ కలిసి రెండు గొర్రెలను సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయించడానికి తీసుకుని వస్తుండగా గొర్రె ఒక్క సారిగా ఎగరటంతో అదుపుతప్పి ప్రైవేట్ బస్సును డీ కొన్నారు, దీంతో ఇరువురికి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు, వెంటనే సమాచారం అందుకున్న సిఐ జయ నాయక్ సంఘటనా స్థలానికి చేసుకుని గాయపడినవారిని 108 వాహనంలో తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్