చిన్నపరెడ్డిపల్లిలో వేప చెట్టుకు పొంగి పొర్లుతున్న కల్లు
పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చిన్నపరెడ్డిపల్లికి చెందిన నల్ల తిప్పన్న రైతు పొలంలో గల వేప చెట్టుకు కల్లు కారుతుంది. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యంగా చెట్టును సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. ఈత చెట్టుకో. తాటి చెట్టుకో కల్లు రావడం సహజం. కానీ వేప చెట్టుకు కల్లు రావటంతో జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పింది జరిగిందని నమ్ముతున్నారు.