నవరత్నాలతో అన్ని వర్గాలకు లబ్ది:ఎమ్మెల్యే

139చూసినవారు
నవరత్నాలతో అన్ని వర్గాలకు లబ్ది:ఎమ్మెల్యే
What: నవరత్నాలతో అన్ని వర్గాలకు లబ్ది చేకూరుతోందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని 17 వ వార్డ్ పరిధిలోని న్యూ కాలనీ, షీఫారం, మహాదేవపురం లోగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Where: పెనుకొండ
When: 30-9-2022 6:57 PM

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్