రాజీనామా చేసిన వ్యవసాయ సలహా మండల చైర్ మెన్: ఆవుటాల

60చూసినవారు
రాజీనామా చేసిన వ్యవసాయ సలహా మండల చైర్ మెన్: ఆవుటాల
శ్రీ సత్య సాయి జిల్లా వ్యవసాయ సలహా మండల చైర్ మెన్ ఆవుటాలా రమణ రెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన సందర్భంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను చైర్ మెన్ గా ఉన్న సమయంలో రైతులకు ఎరువులు, మందులు, విత్తనాలు పంపిణీ చేయడానికి కృషి చెశానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్