రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మార్చిలోగా తాగునీరందే విధంగా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శనివారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, పర్యాటక శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో తాగునీరు, పర్యాటకంగా చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.