నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చిన్నారి స్కందన్ కార్తికేయకు చోటు దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గుమ్మగట్ట మండలం గోనబావికి చెందిన సచివాలయ ఉద్యోగి శాంతి, హేమంత్ కుమారుడు 4నెలల 19రోజుల చిన్నారి స్కందన్ కార్తికేయ ఫ్లాష్ కార్డులను గుర్తించడం సంతోషించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో చిన్నారికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.