బుక్కరాయసముద్రం మండలం, వడియంపేట, దయ్యాలకుంటపల్లి గ్రామాలలో "పల్లె పండుగ" కార్యక్రమం కింద రూ. 26 లక్షల రూపాయల వ్యయంతో మంగళవారం సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సంక్రాంతి పండుగ లోపు సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించినారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సారథ్యంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు.