రాయదుర్గం: అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు

66చూసినవారు
రాయదుర్గం: అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు
రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు. శనివారం ఆయుతపల్లి, బొమ్మక్కపల్లి గ్రామాల నుంచి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 166 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణ, ఎస్ఐ హరికృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్