డి. హిరేహాల్ మండలం కళ్యం గ్రామశివారులో కర్నాటకకు అక్రమంగా తరలించేందుకు ఉంచిన ఇసుక డంప్ ను మంగళవారం మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. డి. హిరేహాల్ ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి, మైన్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ సుప్రజలు ఇసుక నిల్వలున్న ప్రదేశాలను సీజ్ చేశారు. 14 ఇసుక కుప్పలు కలిపి 42 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. ఇసుక నిల్వ ఉంచిన వారిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.