మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలి

51చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలి
రాయదుర్గం పురపాలక సంఘంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికులతో కలిసి గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, కమిషనర్ దివాకర్ రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్మికులు సమర్పించారు. పరిష్కరించని పక్షంలో ఈనెల 28వ తేదీన ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని కార్మికులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్