ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అయ్య గార్లపల్లి గ్రామంలో సోమవారం బాబు (24) అనే వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.