ఏపీ ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.