వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. మద్దతు ధర లేక అవస్థలు పడుతున్న రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతోందన్నారు.