కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా జయపురలో నిర్వహించిన రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రుల సమావేశంలో ఉత్తమ్ పాల్గొని నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరారు. మూసీ పునరుజ్జీవ-అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు.