TG: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పనుంది. పంటల రక్షణ కోసం కొత్త స్కీం తీసుకురానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అడవి జంతువులు, కోతుల నుండి పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తుమ్మల పేర్కొన్నారు. అంతేకాకుండా.. పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను అవసరం మేరకు రైతులకు అందించాలని ఆదేశాలు ఇచ్చారు.