విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్జీజీఓఎస్ కాలనీలోని విష్ణు విల్లా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థిని కె.సాస అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని సీతమ్మధారలోని ప్రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతోంది. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.