ఏపీకి పవన్ కల్యాణ్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన తలచుకుంటే విభజన సమస్యలు పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకుంది.. దీనిపై పవన్‌కు లేఖ కూడా రాశాను’ అని వెల్లడించారు. కేంద్రంతో పవన్ కల్యాణ్ మాట్లాడితే పరిష్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.