దుస్తుల దుకాణంలో అగ్నిప్రమాదం

57చూసినవారు
నార్పలలో దుస్తుల దుకాణంలో విద్యుత్తు షార్ట్ సర్కూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. కూతలేరు వంతెన దగ్గర ఉన్న ఆర్ఆర్ఆర్ దుస్తుల దుకాణ యజమాని రామచంద్రారెడ్డి ఆదివారం రాత్రి ఎప్పటిలాగే తాళం వేసి ఇంటికి వెళ్లాడు. విద్యుత్తు మీటరు వద్ద విద్యుత్తు ప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి మంటలను అదుపులోకి తెచ్చారు. దుస్తులు, ఏసీ ఇతర సామగ్రి కాలిపోవడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్