విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ సూర్యప్రకాష్

65చూసినవారు
విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ సూర్యప్రకాష్
శింగనమల మండల వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైనట్లు గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్ తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ, ఐక్య విద్యార్థి సంఘాలు నీట్ స్కాంకు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన బంద్ ను శింగనమల మండల వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని అన్నారు. నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, విష్ణు, గౌతమ్, బాబు, రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్