విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై నిషేధం

85చూసినవారు
విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై నిషేధం
లెబనాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇటీవల ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటన నేపథ్యంలో దేశ రాజధాని బీరుట్ నుంచి టేకాఫ్ తీసుకునే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై పౌర విమానయాన అధికారులు నిషేధం విధించారు. ఎయిర్పోర్టులకు వచ్చే ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించనున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్