పుట్లూరు మండలంలో అనంతపురం ఆర్డివో గుత్తా వెంకటనాయుడు శనివారం పర్యటించారు. మండల పరిధిలోని కుమ్మనమల గ్రామ పొలం నుంచి యల్లనూరు మండలం బొప్పేపల్లి చెరువుకు నీరు పోవడానికి ఉన్న కాలువను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. పుట్లూరు, యల్లనూరు మండలాల ప్రజల తాగునీరు, సాగునీరు కోసం విచారణ చేపట్టారు.