నార్పల మండలం గూగూడు గ్రామంలో సంక్రాంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ కుల్లాయిస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం ముందున్న అగ్ని గుండం అరటి దుంగలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందించారు.