శింగనమల నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం చంద్రబాబు నాయుడుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. అమరావతిలో సీఎంను కలిసి సమస్యల గురించి వివరించారు. ప్రధానంగా గండికోట నుంచి సుబ్బరాయ సాగర్‌కు నీటి సరఫరా, శింగనమల మండలం రాచేపల్లిలో లెదర్ పరిశ్రమను పునఃప్రారంభం చేయాలని కోరారు. చాగళ్లు రిజర్వాయర్ కు భూములు కోల్పోయిన ఉల్లికళ్లు, ఉల్లికంటి పల్లి రైతులకు పరిహారం మంజూరు చేయాలని కోరారు.