తాడిపత్రి పరిసరాల్లోని పెన్నా నదిలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి బుధవారం తెలిపారు. దేవేంద్ర రెడ్డి, పవన్ కుమార్లకు చెందిన ట్రాక్టర్లు పెన్నానదిలో ఇసుక లోడ్ చేస్తుండగా గుర్తించామన్నారు. ఆ ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసి సీజ్ చేశామన్నారు.