తాడిపత్రిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమిత్ షాను క్యాబినెట్ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.