తాడిపత్రి పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం గంజాయిని సేవిస్తున్న అజయ్, దీపక్, నాగేంద్రతో పాటు విక్రేత మహమ్మద్ షరీఫ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 243 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ సాయిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, మహమ్మద్ షరీఫ్ బళ్లారి నుంచి గంజాయిని తెచ్చి విక్రయించేవాడు. ఫ్లైఓవర్ వద్ద గంజాయిని విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయని ఆయన చెప్పారు.