తాడిపత్రి నియోజకవర్గంలో చివరి ఆయకుట్టు వరకు సాగు నీరు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని జేసీ అస్మిత్ రెడ్డి నీటిపారుదల శాఖామంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రిలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడ్డారన్నారు. పెండేకల్లు నీటి కాలువలు పూర్తి చేస్తే ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందించొచ్చని తెలిపారు.