తాడిపత్రి: అభివృద్ధిలో భాగస్వాములవుదాం

59చూసినవారు
తాడిపత్రి: అభివృద్ధిలో భాగస్వాములవుదాం
తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో మహిళలు సైతం భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో దుస్తుల దుకాణాలు, బ్యూటీ పార్లర్, బంగారు దుకాణ యజమానులు, స్వచ్ఛంద సంస్థ మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మహిళలు తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో ఊరిని అలాగే శుభ్రంగా ఉంచాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్