ఈ నెల 14 నుండి 20వతేదీ20వ తేదీ వరకు జరగనున్న 57వ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను బుధవారం తాడిపత్రి శాఖ గ్రంథాలయంలో ఎంఇఒ నాగరాజు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 14న ప్రారంభ వేడుకలు, 15న పుస్తకప్రదర్శన, 16, 17, 18, 19 తేదీల్లో వివిధ అంశాల్లో వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పోటీ పరీక్షలు, 20న పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.