తాడిపత్రిలో టీడీపీ మున్సిపల్ వైస్ ఛైర్మన్లు షేక్ అబ్దుల్ రహీం, సరస్వతి తమ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని వారు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. 2021 ఏప్రిల్లో వైస్ ఛైర్మన్లుగా ప్రమాణస్వీకారం చేశామని అన్నారు. తమ సహచర సభ్యులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా రాజీనామా చేశామని వారు స్పష్టం చేశారు.