ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు

55చూసినవారు
ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు
తాడిపత్రి మండలంలో ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మండలంలోని చుక్కలూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటి ముందర పార్కింగ్ చేసిన బుల్లెట్ ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్