తాడిపత్రి: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: సీఐ

55చూసినవారు
తాడిపత్రిలో టపాసుల విక్రయ కేంద్రాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సోమవారం తనిఖీలు నిర్వహించారు. రూరల్ పరిధిలోని యల్లనూరు రోడ్డు, కడప రోడ్డులలో ఏర్పాటుచేసిన విక్రయ శాలాలను క్షేత్రస్థాయిలోకి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు, ఎస్ఐ ధరణిబాబులు వెళ్లి పరిశీలించారు. నియమ నిబంధనలను పాటిస్తూ విక్రయాలు జరపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్