ఉరవకొండ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6, 8వ తరగతులలో అదనపు సీట్ల భర్తీ కోసం బుధవారం ప్రవేశపరీక్ష నిర్వహించారు. 8వ తరగతిలో ఒక అదనపు సీటుకు 15 మంది విద్యార్థులు హాజరయ్యారు. 6వ తరగతిలో 5సీట్లకు 83మంది హాజరయ్యారు. పరీక్షలను అబ్జర్వర్ రజాక్ పర్యవేక్షించారు.