భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న పాల్తూరు వాగు

6924చూసినవారు
విడపనకల్ మండలంలో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాల్తూరు, పొలికి వంకలు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపు వెళ్లే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయాయి. ప్రమాదమని తెలిసిన వాగులోనే గ్రామస్తులు ప్రయాణం సాగిస్తున్నారు.