వజ్రకరూరు మండలంలోని గూళ్యపాళ్యం గ్రామంలో ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు రైతు విరూపాక్షి పొలంలో మీటరు బిగిస్తుండగా ఆయన అడ్డుకున్నారు. అనంతరం దానిని విసిరికొట్టారు. దీనిని ఆయన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి మీటర్లు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తులో వీటివల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన వ్యక్తం చేశారు.