వజ్రకరూరు: లింగ వివక్షత లేని సమాజం మన అందరి బాధ్యత
వజ్రకరూర్ మండలంలోని తట్రకల్ గ్రామంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ ధనలక్ష్మి, లింగ వివక్షత లేని సమాజం అందరికి కావాలని, దీనికి ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, వాటిని తొలగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.