రాగులపాడులో భారీ వర్షం
వజ్రకరూరు మండలంలోని రాగులపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండలకు పంటలు ఎండిపోతున్న సమయంలో వర్షం రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గ్రామలో ప్రజలు విద్యుత్ స్తంభం, చెట్లు కింద కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని మండల విద్యుత్ ఏఈ తెలిపారు.