వజ్రకరూరు తహశీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

72చూసినవారు
వజ్రకరూరు తహశీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
వజ్రకరూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల రూమ్లను పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను క్రమ పద్ధతిలో అమర్చి వాటి వివరాలను తెలిపే విధంగా సూచన కార్డులను ఏర్పాటు చేయాలన్నారు. తహశీల్దార్ కార్యాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కార్యాలయం సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్