వజ్రకరూరు మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి ఆధ్వర్యంలో ఆశ డే సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన వైద్యాధికారి డాక్టర్ తేజస్వి మాట్లాడుతూ. గ్రామాలలో గర్భవతుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు అనారోగ్య సమస్యలు తలెత్తుకుండా చూడాల్సిన బాధ్యత ఆశా కార్యకర్తలదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్, నాగ శంకర్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.