దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాలు (వీడియో)

77చూసినవారు
విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవర రేపు విడుదలవుతున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిశాయి. దీంతో జన జాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవర పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’.. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనే నినాదాల పోస్టర్లను అంటించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్