భూమి కోసం, భుక్తి కోసం పోరాటం జరిపిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా గురువారం స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.