జ్వరంతో ఉన్న భవదీప్‌ను తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారు. అక్కడ యాంటీబయాటిక్, స్టెరాయిడ్ ఇంజక్షన్లను పిరుదుకు ఇచ్చారు. ఇలా చేయకూడదు. కాళ్ల వాపులు గమనించిన వెంటనే అప్రమత్తం కాలేదు. అతడి కాళ్ళను బాక్టీరియా తినేయడంతో ఈ నెల 17న శస్త్రచికిత్స చేసి భవదీప్ కుడికాలును తొడ వరకు తొలగించారు. ఎడమ కాలి భాగం ఇప్పుడిప్పుడే నయమవుతోంది. అతడు పూర్తిగా కోలుకునేందుకు మూడు నెలల వరకు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.