బద్వేల్: "వాహనదారులు నిబంధనలు అత్రికమిస్తే చర్యలు తప్పవు"

68చూసినవారు
వాహనదారులు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనదారులు సహకరించాలని బద్వేలు అర్బన్ సీఐ రాజగోపాల్ తెలిపారు. సోమవారం సాయంత్రం పలు ప్రధాన రహదారులలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. సిఐ రాజగోపాల్ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకునేలా ఉండాలన్నారు. మద్యం సేవించి సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్య నేరమన్నారు.

సంబంధిత పోస్ట్