అవినీతికి పాల్పడుతున్న ముదునూరు మండలం ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ మనోహర్‌పై చర్యలు తీసుకోవాలని, రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్, కార్యదర్శి లింగమయ్య డిమాండ్ చేశారు. గురువారం జమ్మలమడుగులో ఆర్డీవో సాయిశ్రీకి వారు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ. ప్రభుత్వ మెనూను పాటించకుండా విద్యార్థులకు ఇష్టానుసారంగా భోజనం పెడుతున్నారన్నారు.