ఆవుకు రిజర్వాయర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా గండికోట జలాశయంలోకి వచ్చే కృష్ణా జలాలు ప్రవాహం తగ్గింది. శనివారం జలాశయంలోకి 5,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయంలో 25.65 నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం నుంచి 6,300 క్యూసెక్కులనీరు దిగువకు వదులుతున్నట్లు జల వనరుల శాఖ డిఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు.