బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వెన్నునొప్పి కోసం శస్త్రచికిత్స చేయించుకునేందుకు గ్రీన్ సిద్ధమైనట్లు పేర్కొంది. అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరో వారం రోజుల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని వెల్లడించింది.