కమలాపురంలో గంజాయి స్వాధీనం, విక్రయదారుడు అరెస్టు

51చూసినవారు
కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని చెరువు కట్ట వద్ద గంజాయి విక్రయిస్తున్న సోమేసుల నాగార్జున సాగర్ ను అరెస్ట్ చేసి 1. 1కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కమలాపురం సిఐ షేక్ రోషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గంజాయి కేసులో స్టేషన్ లో అరెస్టు అయ్యి బెయిల్ పై వచ్చినా ప్రవర్తన మారని నేరస్తుడు నాగార్జునసాగర్ అని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా సూచనలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్