కడప నగర శివారులోని భావన టౌన్ షిప్ అక్రమాలను వెలికితీయాలని, దానిపై సమగ్రమైన విచారణ జరిపించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి కోరారు. ఆదివారం కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డిని కడపలోని వారి కార్యాలయంలో తన ప్రతినిధి బృందంతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. భావన టౌన్ షిప్ అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారని తెలిపారు. ఆర్ సి పి నాయకులు పాల్గొన్నారు.